Baireddy Comments: ప్రభుత్వ తీరుపై బైరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి... శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మంత్రి అనిల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాల్యాల గ్రామంలో వైకాపా నాయకుల దౌర్జన్యంపై.... ఓ రైతు పొలంలో కూర్చుని నిరసన తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో సహకరించలేదని సిద్ధార్థరెడ్డి అండతో లక్ష్మన్న అనే రైతును పొలానికి వెళ్లనీయకుండా దారి మూసేయడాన్ని ఖండించారు. సంబంధిత వైకాపా నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి, అనిల్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.