దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాద్రిలో జరిగే ముక్కోటి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వారంలో దర్శన మిస్తారు. ముక్కోటి దేవతలు శ్రీ రాముడిని దర్శించుకునేందుకు ఇదే ద్వారం వద్ద వేచి ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు.12 రోజుల పాటు జరిగే ముక్కోటి ఉత్సవాల సందర్భంగా భద్రాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హంసవాహనంపై స్వామి వారు నదీ విహారం చేస్తారు. ఉత్సవాల్లో చివరి రోజు ముక్కోటి అనంతరం ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారు దర్శనమిస్తారు.