ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో నదీ అమృత్ ర్యాలి
Continues below advertisement
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నీటిపారుదల శాఖ DEE కెవిఎస్ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో నది ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ భవాని ఘాట్ నుండి పున్నమి ఘాట్ వద్ద వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో నీటి పారుదల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో నది జలాల సంరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధిపై దృష్టి సాధించిన నేటితరం నదులు హరించే విధంగా చర్యలు చేపడుతున్నారు జ. దీని వలన భవిష్యత్తులో నీటి కొరత ఎక్కువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ నది జలాల సంరక్షణ కు కృషి చేయాలన్నారు.
Continues below advertisement