Ayesha Meera Parents Letter: సీజేఐ జస్టిస్ ఎన్వీరమణకు ఆయేషా మీరా తల్లితండ్రుల బహిరంగ లేఖ
ఆయేషా మీరా తల్లితండ్రులు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణకు బహిరంగ లేఖ రాశారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన తల్లితండ్రులు భాషా, షంషద్ బేగం...పద్నాలుగేళ్లు గడిచినా తమ కుమార్తెను హత్య చేసిన వారిని పట్టుకోలేకపోవటం దారుణమన్నారు. పోలీసు, న్యాయ వ్యవస్థను నమ్ముకుని 14ఏళ్లుగా పోరాటం చేస్తున్నా న్యాయం జరగలేదన్నారు. పద్నాలుగేళ్లంటే జీవిత ఖైదు అన్న ఆయేషా మీరా తల్లితండ్రులు...అది పూర్తైనా తమ కుమార్తెకు న్యాయం జరగకపోవటం దారుణమన్నారు. విజయవాడ పర్యటనలో న్యాయవ్యవస్థ గురించి మాట్లాడుతున్న సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ తమ కుమార్తె కేసును పట్టించుకుని న్యాయం చేయాలని కోరారు.