Aurora Polaris: ఉత్తర ధృవ సమీప దేశాల్లో కనివిందు చేస్తున్న అరోరా పొలారిస్ కాంతులు
Continues below advertisement
ఉత్తర ధృవ సమీప దేశాల్లో నార్త్ లైట్స్ కనువిందు చేస్తున్నాయి. అరోరా పొలారిస్ లేదా అరోరా గా పిలుచుకునే ఈ కాంతులు....గత కొద్దిరోజులుగా ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, గ్రీన్ లాండ్ తదితర దేశాల్లో సందడి చేస్తున్నాయి. ఆకుపచ్చ, గులాబి, లేత ఎరుపు, వైలెట్ రంగుల్లో ఆకాశంలో ఈ కాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే ప్లాస్మా...భూ అయస్కాంత శక్తిని తాకటమే ఈ వెలుగులు రావటానికి కారణం. ఇవి ధృవాలకు దగ్గరగా ఉండే దేశాల్లో కనిపిస్తాయి. ప్రస్తుతం కనిపిస్తున్న అరోరా...నార్త్ పోల్ అంటే ఉత్తర ధృవాలకు దగ్గరగా ఉండే ఫిన్లాండ్ లాంటి దేశాల్లో కనిపించి కనువిందు చేస్తున్నాయన్న మాట.
Continues below advertisement