Asaduddin owaisi: విలీనం కాదు.. జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలి | ABP Desam

Continues below advertisement

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలపై రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మెుదలైంది. ఇదే తరుణంలో... MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సెప్టెంబరు 17న ‌ పాతబస్తీలో తిరంగ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 17 హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించింది. అలా కాకుండా.. సెప్టెంబర్‌ 17న జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అందుకోసం.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న ఏర్పాటు చేసే బహిరంగ సభలో... పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola