APSRTC: జీతాలు పెరగలేదు.. పనిభారం పెరిగింది.. ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులతోపాటే ఈనెల ఆరోతేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్తామంటున్నారు. 98శాతం కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వంలో విలీనం అయినంత మాత్రాన తమకు అదనపు ప్రయోజనం ఏదీ కలగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ మద్దతు లేనంత మాత్రాన సమ్మె అగబోదని తేల్చి చెప్పారు. నెల్లూరు జిల్లా ఆర్టీసీ యూనియన్ నాయకులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.