AP Theatres Issue: 'థియేటర్లు ఉన్న ఎమ్మెల్యేలు సీఎంతో మాట్లాడితే బాగుంటుంది'
విజయవాడలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం ముగిసింది. సినిమా టికెట్ రేట్లు, నైట్ కర్ఫ్యూ, 50 శాతం ఆక్యూపెన్సీపై చర్చించినట్లు తెలిపారు. కర్ఫ్యూ సమయంలో మూడు షోలే వేయగలమని.. కొత్త సినిమాలు కూడా ఏవీ రిలీజ్ అవ్వట్లేదని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సహకారం లేకపోతే థియేటర్లు నడపడం కష్టమని... రూ.5 టికెట్ పెట్టే బదులు టీవీలో సినిమా ఫ్రీగా చూడవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలకు థియేటర్లు ఉన్నాయని... సీఎం గారితో చెప్పే చనువున్నా పట్టించుకోవట్లేదన్నారు. చాలామంది నిర్మాతలు అప్పులు చేసేసి.. పైకి మాత్రం షో చేస్తున్నారని ఎగ్జిబిటర్లు తెలిపారు.