AP PRC Issue : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో పీఆర్సీ సాధన సమితి చర్చలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటితో పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. మంత్రుల కమిటీ నుంచి లిఖితపూర్వకంగా లేఖ రావడంతో ఉద్యోగ సంఘాల నేతలు మీటింగ్ కు వెళ్లారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పగా.. ఆ విషయంపై చర్చ జరుగుతోంది. మొత్తంగా 20 మంది పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చకు హాజరయ్యారు.