AP PRC: పోరాటం కొనసాగుతుందన్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ
ప్రభుత్వం ప్రకటించిన ఫిట్ మెంట్ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. వారి జీతాలు తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.రిటైర్ మెంట్ వయసు పెంపు వల్ల ప్రత్యేక ఉపయోగం లేదన్నారు. పీఆర్సీపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 12న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.