AP Governor: ఏపీ రాజ్ భవన్ లో సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి| ABP Desam
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 జయంతిని పరాక్రమ్ దివ్‌సగా జరుపుకొంటున్న శుభ తరుణంలో ఆ గొప్ప నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడికి నా వినయపూర్వకమైన నివాళులు ఆర్పిస్తున్నాను’ అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.నేతాజీ 126వ జయంతి సందర్భంగా గవర్నర్ ఆయనను స్మరించుకుంటూ సందేశం విడుదల చేశారు. ‘పరాక్రమ్ దివస్’ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిని నింపడానికి మార్గం చూపుతుందన్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికి గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.