AP GO: సినిమా టిక్కెట్లు ధరలు... ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇక, టికెట్ల ధరల నియంత్రణపై జీవో నంబర్‌ 35 రద్దు అందరికీ వర్తిస్తుందన్నారు అడిషనల్‌ జనరల్.. కాగా, గత విచారణలో పిటిషనర్లకే జీవో నుంచి మినహాయింపు వస్తుందని హోమ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గతంలో వెల్లడించారు. అయితే, ధరల పెంపుపై ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్లకు పంపాలన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్.. వివరాలను అడిషనల్‌ అఫిడవిట్‌లో దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola