ఆంధ్రప్రదేశ్ ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధులను గావిస్తోంది.
విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ఆవరణలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది.. మొక్కల ,పెంపకం పై ప్రజల్లో పెరుగుతున్న అభిరుచిని ఈ తరహా ప్రదర్శనలు ప్రోత్సహిస్తాయని నిర్వాహకులు అంటున్నారు. మొక్కల పెంపకం దారులను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్రస్థాయి ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశామని వివరించారు. ఇటువంటి ప్రదర్శనలను తిలకించటం ద్వారా, మొక్కల పై అవగాహన పెరుగుతుందని,కాలుష్యం పెరిగిపోతున్న నేటి సమాజంలో పిల్లలకు కూడా మొక్కలు,పండ్ల పెంపకం పై అభిరుచులను అలవరచుకునే దిశగా ప్రదర్శనలు ఉన్నాయన్నారు.