AP FILMS :సినీ వివాదానికి తెర‌దించేందుకు రంగంలోకి దిగుతున్న పెద్ద‌లు

ధియేట‌ర్ల వివాదంపై సినీ ప్ర‌ముఖులు రంగంలోకి దిగుతున్నారు.ఏపీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి పేర్ని నానిని క‌ల‌సి త‌మ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే ఈ విష‌యం పై తీవ్ర స్దాయిలో దుమారాన్ని రాజేసిన నేప‌థ్యంలో చాలా ధియేట‌ర్ల‌ను స్వ‌చ్ఛందంగా మూసేశారు. అంతే కాదు జిల్లాల వారీగా అధికారులు దాడులు చేసి కొన్ని ధియేట‌ర్ల‌ను కూడ సీజ్ చేశారు.ఈ నేప‌ధ్యంలో కొత్త సినిమాలు విడుద‌ల పై ఆందోళ‌న వ్య‌క్తమవుతోంది. ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పెద్ద నిర్మాత‌లు రంగంలోకి దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola