AP Covid Update: ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 13 వేలకు పైగా కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా విజృంభిస్తున్నాయి. రోజూలానే ఇవాళ కూడా పది వేలకు పైగా కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 46,143 పరీక్షలు చేయగా 13,416 మందికి కొవిడ్ సోకింది. రాష్ట్రంలో ప్రస్తుతం లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. ఎక్కువ కేసులున్న జిల్లాగా విశాఖలో 1,791 కేసులుండగా.. తర్వాతి స్థానాల్లో అనంతపురం(1,650), గుంటూరు(1464), కర్నూలు(1409) జిల్లాలున్నాయి. కేసులతో పాటే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.