Jagan : విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.| ABP Desam
పాఠశాల విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యావిధానం అమలుపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు.కొత్తగా వర్గీకరించిన ఆరు రకాల స్కూళ్లు, అందులో ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై సీఎంకు వివరాలు అందించారు.నాడు నేడులో ఏర్పాటుచేసిన సదుపాయాల్లో ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు.