AP BJP Strategy : వచ్చే ఎన్నికల్లోనూ జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తోందా..?
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వ పథకాలకు...తమ స్టిక్కర్లు వేసుకుని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోదన్న సోము..ఇకపై కేంద్రం ప్రభుత్వ పథకాలపై రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తామన్నారు. అంతే కాదు జగనన్న కాలనీలకు మోడన్న కాలనీ గా పేరు పెట్టి ప్రచారం చేస్తున్నామన్నారు.