Anushka Sharma: నాలుగేళ్ల తర్వాత తెర ముందుకు అనుష్క

బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. 2018లో జీరో సినిమాలో ఆఖరుగా కనిపించిన అనుష్క... తన తర్వాతి ప్రాజెక్టు చక్డా ఎక్స్ ప్రెస్ అని ప్రకటించారు. భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అనుష్క.. జులన్ గోస్వామిగా కనిపంచనున్నారు. తన ఇన్స్టాగ్రాంలో చిత్ర టీజర్ ను షేర్ చేశారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమైనదన్నారు. జులన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే సమయానికి దేశంలో మహిళల క్రికెట్ ఉన్న స్థితిగతులు, ఆ తర్వాత అది మారేందుకు జులన్ దోహదపడిన తీరును చిత్రంలో చూపిస్తున్నామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola