Anakapalli Girls: లవర్ కోసం అమ్మాయిలు కొట్టుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో తప్పు ప్రచారం

Continues below advertisement

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద కొట్టుకున్నారు. జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వారి కొట్లాటను చాలా మంది వినోదంగా చూశారు. కొంత మంది వీడియో తీశారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు. ఓ అబ్బాయి కోసం ఇద్దరూ కొట్టుకుంటున్నారని ప్రచారం చేశారు. దీంతో ఆ వీడియోకు ఎక్కడా లేనంత స్కోప్ వచ్చింది. సోషల్ మీడియాలో కలికాలం అని చర్చించుకున్నారు. కామెడీగా కొంత మంది సెటైర్లు వేశారు. మరికొంత మంది అమ్మాయిల క్యారెక్టర్లపై తేడా వ్యాఖ్యలు  చేశారు. ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా స్పందించారు. కానీ నిజంగా అక్కడేం జరిగిందో అనే సంగతి ఎవరూ పట్టించుకోలేదు.


అనకాపల్లికి చెందిన అ ఇద్దరు ఆడపిల్లలు కొట్టుకున్నది అబ్బాయి కోసం అని సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేసింది. ఎక్కువ మంది అదే నమ్మారు. దీనికి కారణం నిజం ఏమిటో తెలియకపోడం. అసలు నిజం ఏమిటంటే... ఆ ఇద్దరూ కొట్టుకుంది అబ్బాయి కోసం కాదు. ఓ చిన్న మాటగొడవను పట్టుదలకుపోయి అంతకంతకూపెంచుకోవడంతోనే సమస్య వచ్చింది. అనకాపల్లిలో కాలేజీలు ముగిసిన తర్వాత ఎక్కువ మంది పక్క కాలనీలు...గ్రామాలకు బస్సుల ద్వారా వెళ్తూంటారు. ఇలా తమ ఇంటికి వెళ్లేందుకు ఓ విద్యార్థిని... మత కాలేజీలోనే చదువుతున్న ఓ కజిన్‌తో కలిసి  బస్టాప్‌లో కూర్చుంది. వారిద్దరూ అకడమిక్ విషయాలో... మరో కుటుంబపరమైన విషయాలో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో యువతి అటుగా వెళ్తున్న సమయంలో యువకుడి కాలు ఆమెకు తగిలింది. ఆ యువతి  కావాలనే ఆ యువకులు కాలుతో తాకాడన్న ఉద్దేశంతో గట్టిగా అరిచింది. దాంతో  యువకుడితో ఉన్న అమ్మాయి  సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. కావాలని తన కజిన్ కాలుతో తాకలేదని చెప్పింది .


అయితే ఇరువరి మధ్య ఆ అంశంపై మాటాకు మాట పెరిగిపోయింది. చివరికి ఇద్దరూ సహనంకోల్పోయి కొట్టుకోవడం ప్రారంభించారు. వీరిద్దరినీ విడతీయాల్సిన జనం చోద్యం చూశారు. వీడియో తీశారు. తనకు తెలిసిన అబ్బాి.. మా కజిన్ అని ఓ అమ్మాయి చెబుతున్న మాటలను మ్యానిపులేట్ చేసి.. నా వాడు..నా నాడు అని ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నారని ప్రచారం చేశారు. ఆ గొడవ సద్దుమణిగిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత తమ పేరుతో.. తామ గొడవ వీడియోతో జరుగుతున్న ప్రచారం చూసి ఆ అమ్మాయిలు ఇద్దరూ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యారు. 


ఈ ప్రచారం ఆ అమ్మాయిలిద్దరికే కాదు..వారి తల్లిదండ్రులకూ తలవంపులు తెచ్చేదే. ఆ పిల్లల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావంచూపేలా ఉన్న ఆ వీడియో..దానికి లింక్‌చేసి ప్రచారం చేస్తున్న కట్టకథ ఆ తల్లిదండ్రుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. వెంటనే తమ పిల్లల్ని ఇక బయటకు  పంపించలేనంత ఆవేదనకు గురయ్యారు. వారిలో ఓ అమ్మాయిని చదువు మాన్పించేశారు తల్లిదండ్రులు. మరో అమ్మాయి కోలుకోలేనంతగా మానసికంగా ఇబ్బంది పడుతోంది.  అప్పటి వరకూ కాలేజీలో.. బంధువుల్లో మంచి పిల్లలుగా ఉన్న తాము ఒక్క సారిగా ఇలా సోషల్ మీడియాలో తమ ప్రమేయం లేకుండానే చెడ్డవారిగా ట్రోల్ కావడం ... వారికి సోషల్ మీడియా విధించిన శిక్ష.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram