Allu Arjun Imitates Sukumar: షాట్ తర్వాత ఓకేనా... కాదా..ఈ సుకుమార్ చెప్పడేంట్రా బాబూ..!
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్పం. హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో యూనిట్ హుషారుగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా టీం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సరదాగా సుకుమార్ ని ఇమిటేట్ చేశాడు అల్లు అర్జున్. షాట్ తీసిన తర్వాత బాగుందో బాగోలేదో చెప్పకుండా సుకుమార్ ఇచ్చే కన్ఫ్యూషన్ ఎక్స్ ప్రెషన్స్ ఇమిటేట్ చేసి మరీ అందరిలోనూ నవ్వుల పువ్వులు పూయించాడు ఐకాన్ స్టార్