నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణ

సినీ నటి తమన్నా ఈడీ ఎదుట హాజరైంది. గువాహటిలోని ఆఫీస్‌కి పిలిపించి అధికారులు ఆమెని ప్రశ్నించారు. బిట్‌కాయిన్ మైనింగ్ స్కామ్‌ కేసులో భాగంగా ఆమెని విచారించారు. HPZ Token అనే మొబైల్ యాప్‌లో కొందరు అక్రమంగా బిట్‌కాయిన్స్‌ ఇన్వెస్ట్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ యాప్ ద్వారా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ చెబుతోంది. అయితే..ఈ యాప్‌కి సంబంధించిన ఓ ఈవెంట్‌కి తమన్నా హాజరైంది. ఛార్జ్‌షీట్‌లో పేరు ఎక్కడా లేకపోయినా.. కేవలం విచారించేందుకు మాత్రమే ఆమెని పిలిపించినట్టు తెలుస్తోంది. సైబర్ క్రైమ్ ఆపరేషన్‌లో భాగంగా దేశంలో దాదాపు 299 సంస్థల్ని గుర్తించింది ఈడీ. వీటి ద్వారా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించింది. వీటిలో 76 సంస్థలు చైనాలోనివే అని వెల్లడించింది. HPZ Token యాప్‌ ద్వారా ఇన్వెస్టర్‌లను మోసం చేస్తున్నారని ఈడీ గుర్తించింది. షెల్ సంస్థల్ని చూపించడంతో పాటు డమ్మీ డైరెక్టర్‌లను క్రియేట్ చేసి..వీటిని చూపించి పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబడుతోంది. 50 వేలకుపైగా పెట్టుబడి పెడితే రోజుకి 4 వేల చొప్పున రిటర్న్స్ వస్తాయని ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే ఈడీ దాడులు చేసి ఈ బండారమంతా బయటపెట్టింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola