Watch: ఈడీ ఆఫీసుకు ఛార్మి.. డ్రగ్స్ కేసులో విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. గురువారం ఈడీ ఎదుట విచారణకు నటి ఛార్మి హాజరయ్యారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి కూడా గతంలో పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2015-2017 మధ్యలో జరిగిన బ్యాంకు లావాదేవీలను తెలపాలని ఈడీ కోరింది. అంతేకాక, ఛార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు.