ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌

దక్షిణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్  సదరన్ రైజింగ్ సమ్మిట్ ను నిర్వహించేందుకు సిద్దమయింది ఏబీపీ నెట్‌వర్క్. దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నడుపుతున్న ABP NETWORK ఇండియా గ్రోత్ స్టోరీలో సౌతిండియా ప్రాధాన్యతను తెలిపేందుకు సదస్సులు నిర్వహిస్తోంది. సౌతిండియా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసేలా  The Southern Rising Summit 2024 ను అక్టోబర్ 25న హైదరాబాద్‌లో నిర్వహించనుంది. ఈ సెకండ్ ఎడిషన్ సమ్మిట్ లో దక్షణాది రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో వేసిన ముద్ర వేసిన వారు మాట్లాడతారు. దేశ ప్రగతిలో దక్షిణ భారత ప్రాధాన్యతను అందులో ఈ వ్యక్తుల పాత్రను సదస్సు ఆవిష్కరిస్తుంది. "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" జాతీయ కోణంలో దక్షిణాది ప్రాధాన్యతను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించనుంది. Coming of Age: Identity, Inspiration, Impact”, అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో  కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు దక్షిణాది ప్రత్యేకతను నిలబెట్టుకునే అంశంపై ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి. అలాగే ఆయా రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాల్సిన అంశాల ప్రముఖులు తమ ఆలోచనలు పంచుకుంటారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola