బ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీ

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సమ్మిట్‌లో భాగంగా రష్యాకి వెళ్లారు. రష్యా ఈ సారి ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని..పలు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే...ఈ సమ్మిట్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. భారత్‌తో ఉన్న మైత్రిని వివరిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ స్పీచ్ ఇచ్చారు. రష్యన్‌ లాంగ్వేజ్‌లో మాట్లాడారు. పక్కనే ఉన్న ట్రాన్స్‌లేటర్ పుతిన్ ఏమంటున్నారో మోదీకి వివరించే ప్రయత్నం చేశారు. అంతలోనే పుతిన్ జోక్యం చేసుకున్నారు. "నేను మాట్లాడే వాటికి అనువాదం అవసరం లేకుండానే మోదీకి అర్థమైపోతాయి. మా ఫ్రెండ్‌షిప్ అలాంటిది" అని నవ్వుతూ చెప్పారు. వెంటనే ఆ ట్రాన్స్‌లేటర్ పుతిన్ అన్న మాటల్ని మోదీకి వివరించారు. ఇది వినగానే...మోదీ గట్టిగా నవ్వుకున్నారు. ఈ ఘటనతో కాసేపు నవ్వులు పూశాయి. ప్రధాని మోదీ, పుతిన్ ఫ్రెండ్‌షిప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సందర్భాల్లో మోదీపై పొగడ్తలు కురిపించారు పుతిన్. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎన్నో సార్లు చెప్పారు. ఈ సారి బ్రిక్స్ సమ్మిట్‌లో మరోసారి వీళ్ల మైత్రి అందరికీ తెలిసింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram