64 Years Old Thief : 18 కేసుల్లో దొంగ‌ను ప‌ట్టుకున్న బెజ‌వాడ పోలీసులు

దేవుని ఆలయాలే అతని టార్గెట్. సాధారణ భక్తునిలా వచ్చి ఆలయ పరిసరాలు పరిశీలించి చోరీకి ప్లాన్ వేస్తాడు. రాత్రికిరాత్రే దేవతామూర్తుల విలువైన ఆభరణాలు మాయం చేస్తాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 వరుస చోరీలకు పాల్పడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అరవై నాలుగేళ్ల అనే అంతర్రాష్ట్ర నేరస్తుడు పోలీసులకు చిక్కాడు.విజ‌య‌వాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా చోరీల‌కి సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడ వన్ టౌన్ లోని కుసుమ హరనాథ మందిరంలో జరిగిన చోరీ కేసు పై దృష్టి పెట్టిన పోలీసులు గస్తీ ముమ్మరం చేసి అనుమానాస్పద వ్యక్తులు, జైలు నుంచి విడుదలైన నేరస్తుల పై నిఘా ఏర్పాటు చేయడంతో నిందితుడు పోలీసులకు దొరికిపోయాడని తెలిపారు. హైదరాబాద్ విజయవాడతో పాటు పశ్చిమ గోదావరి,గుంటూరు, ప్రకాశం జిల్లాలో నిందితులు 18 ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు ఆయన వివరించారు. నిందితుని నుంచి 60 లక్షల 538 పైగా విలువైన 224 571 గ్రాముల బంగారం 80 పాయింట్ 256 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు .

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola