2021 Andhra Pradesh review: 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి
021 ఆంధ్రప్రదేశ్‌కు కొంచెం తీపి.. ఎంతో చేదు మిగిల్చింది. రాజకీయ దాడులు..కేసులు..తిట్లు రాజకీయాలను డామినేట్ చేశాయి. సబ్బం హరి, సీతారామశాస్త్రి, రోశయ్య వంటి వారిని తెలుగు ప్రజలు కోల్పోయారు.గడిచిపోతున్న కాలం జ్ఞాపకాలను మిగులుస్తుంది. అందులో కొన్ని ఎప్పుడూ గుర్తు చేసుకునేవి.. కొన్ని అప్పుడప్పుడూ జ్ఞప్తికి తెచ్చేవి ఉంటాయి. కాల గమనంలో మరో ఏడాది కలిసిపోతోంది. 2021 ముగిసిపోతోంది. నెల వారీగా ఆ నెలలో జరిగిన ముఖ్య సంఘటనలు వాటి ప్రభావంపై ఇయర్ ఎండర్ రివ్యూ.