క్రిస్మస్ చెట్టుకి -వేడుకకు సంబంధం ఏంటి?
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీస్ కళ్లు మిరిమిట్లు గొలిపేలా కాంతులు వెదజల్లుతున్నాయి. ఇంతకీ ఈ క్రిస్మస్ పండుగకు ట్రీకి ఉన్న సంబంధం ఏంటి.డిసెంబర్ 25 క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ ప్రార్థనలతో మారుమోగిపోతాయి. క్రైస్తవుల ఇళ్లన్నీ విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతుంటాయి. క్రిస్మస్ వేడుకకు కొద్ది రోజులే ఉండడంతో అప్పుడే సందడి మొదలైంది. ఎవరి స్థోమతకు తగ్గటుగా వారు జరుపుకునే ఈ వేడుకల్లో భాగంగా చర్చిలు, ఇళ్లను విద్యుత్ దీపకాంతులతో అలంకరించడం, ప్రార్థనలు చేయడం, కొత్తబట్టలు ధరించడం, శాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిలో క్రిస్మస్ సందడి మొదలైంది అనిపించేది మాత్రం క్రిస్మస్ ట్రీ అలంకరణతోనే.