Rajasthan Congress: ఎన్నికలకు 14 నెలలు, సీఎం మార్పు..? ప్రయోగాలు ఫలిస్తాయా?
రాజస్థాన్ లో రాజకీయం మరోసారి రసకందాయంలో పడింది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నారు. ఆయన దాదాపు అధ్యక్ష్య పదవిని చేపట్టడం ఖాయంగా కన్పిస్తోంది. మరి అశోక్ గెహ్లాట్ అధ్యక్ష్య పదవి చేపట్టిన తర్వాత రాజస్థాన్ సిఎంగా కొనసాగుతారా? లేక పదవికి రాజీనామా చేస్తారా?