Viral Video Woman Swept Away By Giant Wave At Bandra Bandstand: పిల్లల కళ్ల ముందే ఘోరం

Continues below advertisement

ముంబయిలో సరిగ్గా వారం రోజుల క్రితం చోటు చేసుకున్న విషాదం ఇది. గత ఆదివారం.... జ్యోతి సోనార్ అనే ఈ మహిళ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి సరదాగా బాంద్రా బాండ్ స్టాండ్ వద్ద సముద్రాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. భర్తతో కలిసి రాళ్ల మీద కూర్చుని ఫొటోలు దిగుతున్నారు. ఆ సమయంలో అలల ఉద్ధృతి తీవ్రంగానే ఉంది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఓ పెద్ద అల వచ్చి.... రాళ్ల మీద కూర్చున్న వాళ్లిద్దరినీ బలంగా తాకింది. దాని ధాటికి ఆమె నియంత్రణ కోల్పోయి... సముద్రంలోకి కొట్టుకువెళ్లిపోయారు. ఆమె చీరను పట్టుకుని వెనక్కి లాగే ప్రయత్నం.... భర్త చేసినా సరే చేయి జారిపోయి ఆమె గల్లంతైంది. పోలీసులు, అక్కడ రెస్క్యూ సిబ్బంది వెంటనే అలర్ట్ అయినా లాభం లేకపోయింది. అదే రోజు సాయంత్రానికి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె కొట్టుకువెళ్లిపోతుండగా.... పిల్లల కేకలు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram