Thoothukudi Kanyakumari Floods Drone Visuals: వరదల ధాటికి వణుకుతున్న దక్షిణ తమిళనాడు, నీటమునిగిన కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాలు
మిగ్ జాం తుపాను బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే తమిళనాడును మరోసారి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దక్షిణ తమిళనాడులో, ముఖ్యంగా తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల ప్రభావం దారుణంగా ఉంది. ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ చూస్తేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.