Lathicharge In Sabarimala: శబరిమలలో దర్శనానికి ఇంకెంతసేపు అని అడిగిన భక్తులపై లాఠీఛార్జ్
ప్రతిష్ఠాత్మక పుణ్యక్షేత్రం శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నిన్న రాత్రి నుంచి రద్దీ దృష్ట్యా శబరిమాల మార్గంమధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. తాళ్లను కట్టి వారిని గంటల తరబడి నిలిపివేశారు. చిన్నపిల్లలు ఉన్నారని, ఇంకెంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. సుమారు 18 కంపార్ట్మెంట్లలో అయ్యప్ప స్వాములు దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి 10 గంటలపైనే పడుతున్నట్టు సమాచారం. కనీసం మంచినీరు కూడా ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అందించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.