Taraka Ratna Health Update : ఎక్మోపై తారకరత్న లేరని వైద్యుల ధృవీకరణ
తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు మీడియా కథనాల్లో వస్తున్నట్లు తారకరత్న ఎక్మోపై లేరన్నారు. వారి కుటుంబం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యపరిస్థితిని వివరిస్తోందన్న వైద్యులు....ఆయన ఆరోగ్య విషయంలో ఎలాంటి మార్పులున్నా వెంటనే చెబుతామన్నారు.