Ornaments For Ayodhya Ram Mandir: అయోధ్య రాముడికి బృందావనం నుంచి వెండి ఫ్లూట్, శంఖం... ఆభరణాలు కూడా..!
రాముడి కోసం కృష్ణుడి మురళి కదిలివస్తోంది. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరగబోతోందని తెలిసిందే కదా.ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ బృందావనంలోని బంకే బిహారీ ఆలయానికి చెందిన పూజారి, అయోధ్య రామమందిరానికి వెండి మురళి మరియు శంఖంతో పాటుగా కొన్ని ఆభరణాలు కూడా పంపిస్తున్నారు. వాటన్నింటికీ పూజలు కూడా చేశారు.