RG Kar Hospital Attack Video |Kolkata Doctor Case | ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ | ABP Desam

RG Kar Hospital Attack Video |Kolkata Doctor Case  |

కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో రోజుకో ట్విస్ట్ వస్తుంది. బుధవారం అర్ధరాత్రి ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో కొందరు దుండగులు వచ్చి విధ్వంసం సృష్టించారు. ఓ వైపు డాక్టర్లు ఆందోళనలు తెలుపుతుంటే..నిరసన కారుల్లా వచ్చి ముసుగులు ధరించి కొందరు నానా హంగామా సృష్టించారు. రాళ్లు, రాడ్లతో అక్కడున్న వస్తువుల్ని ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు. ఆ విజువల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మీరే చూడండి..! ఈ దాడికి పాల్పడిన 40 మందిలో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐతే..సడన్ గా ఈ దాడి ఎందుకు చేశారు..? నిందితుల సాక్ష్యాధారాలు చేరిపేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారా అని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు.వైద్యులు కూడా సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు దుండగులు వేసిన ఎత్తుగడగా చెప్పుకుంటున్నారు. ఐతే.. కోల్ కతా పోలీసులు మాత్రం... నేరం జరిగిన సెమినార్ హల్ వద్దకు ఎవరు వెళ్లలేదని. సాక్ష్యాధారాలు ధ్వంసం కాలేదని స్పష్టం చేస్తున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola