Prayers For Chandrayaan 3 Soft Landing: దేశమంతా పూజలు, కోరిక మాత్రం ఒక్కటే..!
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టులో ఇవాళే ఆఖరి ఘట్టం. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అవుతుందా లేదా అని దేశం మాత్రమే కాదు ప్రపంచం అంతా ఆసక్తిగా ఇస్రోవైపు చూస్తోంది. ఇంతటి కీలక సమయంలో దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలకు మానసికంగా అండగా ఉంటున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ అవాలని కోరుకుంటూ.... దేశవ్యాప్తంగా కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ పూజలు చేస్తున్నారు. నమాజులు చేస్తున్నారు. ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. గంగా నది ఒడ్డున ప్రత్యేక హారతిని కూడా నదికి సమర్పించారు.