PM Modi Meditates At Vivekananda Rock Memorial | ధ్యానంలో మోదీ..బీజేపీ లెక్కలు ఇవేనా..?

Continues below advertisement

గురువారం సాయంత్రం 6.45 గంటల సమయంలో మోదీ ధ్యానం ప్రారంభించారు. శనివారం వరకు ఈ ధ్యానం కొనసాగుతుంది. ఈ సమయంలో ఫుడ్ తీసుకోరు. కేవలం లిక్విడ్స్ తీసుకుంటారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసమే తీసుకుంటారు. ఈ 45 గంటల సమయం పాటు ఆయన మెడిటేషన్ హాల్ నుంచి బయటికి రారు. కాషాయ దుస్తుల్లోనే ఉంటారు. ఫోన్, టీవీ ఏమి ఉపయోగించరు. ఎవరిని కలవరు కూడా. 

2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్‌నాథ్‌ వద్ద గుహల్లో ఇలాగే ధ్యానం చేశారు.కానీ ఈ సారి కన్యాకుమిరినే ఎందుకు ఎంచుకున్నారు అన్నది తెలియాలంటే కాస్త చరిత్రలోకి వెళ్లాల్సిందే..!కన్యాకుమారిలోని వావవతురై బీచ్‌కి 500 మీటర్ల దూరంలో ఉందీ రాక్‌ మెమోరియల్. హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలిసే ఈ చోట దీన్ని నిర్మించారు. 1892లో ఈ ప్రాంతంలోనే స్వామి వివేకానంద ఓ రాయిపై ధ్యానం చేసుకున్నారు. మూడు రోజులు, మూడు రాత్రుల పాటు ఇక్కడే ధ్యానంలో ఉన్నారు. ఇక్కడ ధ్యానం చేసుకున్న తరవాత ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతారు. ఆయన తన సిద్ధాంతాలకు తుది రూపు తీసుకొచ్చింది కూడా ఇక్కడే. ఈ ప్రాంతం గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో 1963లో RSS కార్యకర్త ఏక్‌నాథ్ రనాదే వివేకానంద రాక్‌ మెమోరియల్ నిర్మించాలని ప్రతిపాదించారు. 1970 నాటికి ఆ నిర్మాణం పూర్తైంది. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి దీన్ని ప్రారంభించారు. ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే ప్రధాని మోదీ ఇక్కడే ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు. వివేకానందుడిని రోల్‌మోడల్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోదీ రామకృష్ణ మిషన్‌లో సభ్యులు కూడా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram