Maharashtra Man Passed 10th class After 11 Attempts |పదిసార్లు రాస్తే గాని పది పాస్ అవ్వలేకపోయాడు

యస్..మీరు థంబ్ లో చూసింది నిజమే. మనోడు పదో తరగతి పాస్ కావడానికి పది సార్లు పరీక్షలు రాశాడు. మహారాష్ట్రలోని బీడ్ నగరానికి చెందిన కృష్ణ నామ్‌దేవ్ ముండే గత ఆరేళ్లుగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. రాసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సారి అతని కష్టం వృథా కాలేదు. తాజాగా మహారాష్ట్ర బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో కృష్ణ నామ్‌దేవ్ మొండే పాసయ్యాడు. దీంతో ఆ ఊర్లో పండుగ వాతావరణం కనిపించింది. కొడుకు పాసయ్యాడనే ఆనందంలో కృష్ణ నామ్‌దేవ్ ముండే తండ్రి అతన్ని భుజాల మీద ఎక్కించుకుని గ్రామంలో ఊరేగింపు చేపట్టాడు. డప్పులు కొట్టిస్తూ సంబరాలు చేసుకుంటూ తన కొడుకు పాసయ్యాడని ఊరంతా చెప్పుకొచ్చాడు.

పరీక్షలో ఫెయిల్ అవ్వగానే డిప్రెషన్ లో కి వెళ్లిపోయే విద్యార్థులకు ఇతడో స్ఫూర్తిదాయకం. ఒకటికాదు..రెండు కాదు.. ఏకంగా పదిసార్లు ఫెయిల్ ఐ..11వ అటెమ్ట్ లో పాసయ్యాడంటో అతడు ఎంత పట్టుపట్టిండో అర్థమవుతోంది. సో..విద్యార్థులు మీరు కూడా పరీక్షల్లో ఫెయిల్ ఐతే నిరుత్సాహపడకుండా మరో గట్టి ప్రయత్నతో విజయం సాధించండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola