Panchvaktra Temple Viral Video | Himachal Floods: అప్పుడు అలా, ఇప్పుడు ఇలా..!
హిమాచల్ వరదల నేపథ్యంలో వైరల్ అవుతున్న వీడియో ఇది. పంచవక్త్ర ఆలయం. శివుని గుడి. వరదల ధాటికి గుడి చుట్టూ నీరు చేరింది. ఆలయం దాదాపుగా నీటమునిగింది. నీటమునిగిందే కానీ ఆలయ నిర్మాణం మాత్రం చెక్కుచెదరలేదు. ఆధునిక సాంకేతికతతో నిర్మించిన భవనాలు, బ్రిడ్జిలే కొట్టుకుపోతుంటే.... ఈ పురాతన ఆలయాలు అప్పుడు, ఇప్పుడు అలానే నిలబడటం సర్వత్రా చర్చకు దారి తీసింది.