నాసా మెచ్యూర్డ్ గా వ్యవహరించలేకపోతోందా..?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ చేసింది. దేశవాసులందరూ గర్వంతో ఉప్పొంగుతున్న మూమెంట్. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. కానీ అందులో ఒకటి మాత్రం భారతీయులను అప్ సెట్ చేసేలా ఉంది.