Narendra Modi Taking Oath | ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ

నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు కేంద్రమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ తరవాత వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు మోదీ రాజ్ ఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి శ్రద్ధాంజలి ఘటించారు. మోదీ ప్రమాణస్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. విదేశాధినేతలు ఉండే హోటళ్ల వద్దా సెక్యూరిటీ పెంచారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఫేషియల్ రికగ్నిషన్‌ చేయనున్నారు. ఆ మేరకు భద్రతా వలయాన్ని మరింత పెంచారు. ఈ కార్యక్రమానికి ఎన్జీయే కూటమి ఎంపీలు సహా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola