Chandrayaan 3 Lander Soft Landing : అంతరిక్ష వాణిజ్యంలో అగ్రస్థానంపై భారత్ కన్ను
అసలెందుకీ అంతరిక్ష ప్రయోగాలు. ఇంత ఇంత ఖర్చు అవసరమా అని చాలా మంది అనుకోవచ్చేమో కానీ. అంతరిక్ష పరిశోధనలు మనం ఊహించలేని స్థాయిలో పెట్టుబడులను సాధించగలుగుతున్నాయి. 2017 నుంచి ప్రపంచవ్యాప్తంగా 1791 అంతరిక్ష టెక్నాలజీ కంపెనీలు అక్షరాలా 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టగలిగాయి. స్పేస్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం 2023 సెకండాఫ్ కే స్పేస్ ఎకానమీ విలువ 45లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటందని అంచనా. గడిచిన పదేళ్లలో ఈ రంగం 91శాతం వృద్ధిని చవిచూసింది. ఇలాంటి టైమ్ లో అతితక్కువ ఖర్చుతోనే అంతరిక్ష ప్రయోగాలు చేసే ఇస్రో ప్రపంచపెట్టుబడిదారులకు స్వర్గధామంగా చెప్పుకోవచ్చు.