Huge Lamp For Ayodhya: అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు గిన్నిస్ రికార్డు టార్గెట్ చేసిన కళాకారులు
Continues below advertisement
జనవరి 22వ తేదీన అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భక్తులందరూ ఒక్కో విధంగా తమ భక్తి చాటుకుంటున్నారు. కోల్ కతాకు చెందిన ఏడుగురు కళాకారులు ఓ భారీ మట్టి దీపాన్ని తయారు చేస్తున్నారు. 22న ఒడిశాలోని రూర్కేలాలో దీన్ని వెలిగించబోతున్నారు. ఈ దీపం వ్యాసార్థం 20 అడుగులు, పొడవు 5 అడుగులు. ఇందులో సుమారు 7వేల లీటర్ల నెయ్యి పడుతుందని అంచనా వేస్తున్నారు. అత్యంత పెద్ద దీపం తయారు చేసిన ఘనతతో గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పాలని చూస్తున్నట్టు ఈ కళాకారులు చెప్తున్నారు.
Continues below advertisement