Delhi Girl Dragged Case | Sultanpuri | Kanjhawala: నాలుగు కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు
దేశ రాజధాని దిల్లీలో ఘోరం జరిగింది. జనవరి ఒకటవ తేదీన ఔటర్ దిల్లీలోని సుల్తాన్ పురిలో 20 ఏళ్ల యువతి స్కూటీ నడుపుతుండగా.... ఢీకొట్టిన ఓ కారు ఆమెను సుమారు 4 కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. ఈ దారుణ ప్రమాదంలో ఆమె మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారులో ఉన్న ఐదుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది ప్రమాదం కాదని, ప్రణాళిక ప్రకారం హత్య చేశారని అమ్మాయి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సుల్తాన్ పురి పోలీస్ స్టేషన్ బయట పలువురు ఆందోళనకు దిగారు. ఉద్రిక్తత నెలకొంది.