Airforce MIG-29 Fighter Jet Fuel Tank Dislodged: పశ్చిమ బంగాల్ లో ప్రమాదం

Continues below advertisement

భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్ కు మరోసారి ప్రమాదం జరిగింది. ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. పశ్చిమ బంగాల్ లోని పశ్చిమ మేదీనీపూర్ లో మిగ్-29 ఫైటర్ జెట్ కు ఉండే అదనపు ఫ్యూయెల్ ట్యాంక్.... ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వేరుపడి సమీపంలోని అడవిలో పడిపోయింది. రోజువారీ శిక్షణ కార్యక్రమాలు ముగించుకుని వస్తుండగా.... ఈ ఘటన జరిగింది. కలైకుండా ఎయిర్ బేస్ కు దగ్గరలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీసేందుకు దర్యాప్తు ప్రారంభమైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram