Aam Aadmi Party About Modi Gujarat Model: వైరల్ వీడియోతో ఆప్ విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ.... ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంపై విమర్శలు చేసింది. జాంనగర్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద వీడియోను షేర్ చేసింది. మూడు రోజుల క్రితం ఓ బస్సులో ప్రయాణిస్తుండగా విద్యార్థులకు జరిగిన ప్రమాదం ఇది. వారిద్దరూ బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సు ఓ స్పీడ్ బ్రేకర్ దాటింది. ఆ కుదుపు దెబ్బకు వెనుక సీట్ లో ఉన్నవారిద్దరూ అద్దాలు బద్దలుగొట్టుకుని మరీ కింద రోడ్డు మీద పడ్డారు. ఇదే వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ వైరల్ చేస్తోంది. బస్సు ప్రయాణం అంటే కామన్ మ్యాన్ కు ప్రభుత్వానికి ఉన్న రిలేషన్ షిప్ కు ఓ నిదర్శనం అని ట్వీట్ చేసింది. మోదీ గుజరాత్ మోడల్ లో ఇలా ఉంది. కేజ్రీవాల్ దిల్లీ మోడల్ లో ఎలక్ట్రిక్ బస్సులు చూడండంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది.