Actor Balakrishna: పునీత్ నా గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతాడు
నటనతో అలరించి, సేవలతో ఆదుకుని ఎంతో మంది గుండెల్లో చోటు సంపాదించుకున్న కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ నా గుండెలోనూ చిరస్థాయిగా నిలిచిపోతాడని నందమూరి బాలకృష్ణ అన్నారు. పునీత్ కు నివాళుర్పిస్తూ బాలకృష్ణ, ప్రభుదేవా భావోద్వేగానికి లోనయ్యారు. బాలయ్య అయితే చేతితో తలను పట్టుకుని దేవుడు ఎందుకు ఇలా చేశాడని విలపించారు. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ను ఓదార్చారు. నివాళులర్పించిన అనంతరం మీడియా మాట్లాడుతూ పునీత్ మరణం తనకు తీరని లోటు అన్నారు. ప్రభుదేవా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.