Puneeth Rajkumar: పునీత్.. మంచి నటుడు మాత్రమే కాదు రియల్ లైఫ్‌లో హీరో
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణంతో కన్నడ సినిమా ఇండస్ట్రీతో పాటు భారత సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్ తన 46 ఏళ్ల జీవితంలో 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధ శరణాలయాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలను నిర్మించడంతో పాటు.. 1800 మంది స్టూడెంట్స్ కి ఉచిత విద్యను అందించారు. పునీత్ చేసిన ఈ సేవలకు గాను కన్నడ ఇండస్ట్రీ అతడిపై ప్రశంసలు కురిపిస్తోంది. తను చనిపోతూ కూడా తన రెండుకళ్లను దానం చేశాడు ఈ హీరో
Tags :
Puneeth Rajkumar Puneeth Rajkumar Death News Puneeth Rajkumar Passed Away Puneeth Rajkumar Dies