Allipoola Vennela: 'అల్లిపూల వెన్నెల' బతుకమ్మ పాటను విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి రూపొందించిన  బతుకమ్మ పాట "అల్లిపూల వెన్నెల"ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ మంగళవారం విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. తెలంగాణ ఆడపడుచల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట "అల్లిపూల వెన్నెల" గా సరికొత్త సొబగులు అద్దుకుంది. బతుకమ్మ ఆట, పాటను వివరించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పాటను ఇవాళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విడుదల చేశారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు.
అక్టోబర్ 6 నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ పాటను తెలంగాణలోని వివిధ లొకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola