తెలంగాణ రక్తచరిత్ర.. కొండా దంపతులపై ఆర్జీవీ సినిమా
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే అందరిలో ఆసక్తి కలుగుతుంది. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన వర్మ..తాజాగా తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. కొండా పేరుతో ఓ సినిమాను ఆయన త్వరలో పట్టాలెక్కించబోతున్నాడు. కొండా మురళీ–సురేఖ, ఆర్‌కె అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కొండా సినిమాకి సంబంధించి వర్మ ఓ వాయిస్ విడుదల చేశారు.