Watch: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవ చూడండి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వీనులవిందుగా సాగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు అని భక్తులకు ధైర్యం చెప్పడమే కల్పవృక్ష వాహన అంతరార్థం. కరుణా కారణంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి.